Reduce Fuel Consumption Super Tips 2024 : తక్కువ పెట్రోల్ తో ఎక్కువ మైలేజ్ పొందడం ఎలా?

Reduce Fuel Consumption, Introduction, How to Reduce Fuel Consumption, Top 5 Synthetic Oils, Conclusion, FAQ (సరైన స్నిగ్ధతను ఎంచుకోండి, సింథటిక్ నూనెలను ఉపయోగించండి, రెగ్యులర్ చమురు మార్పులు, చమురు స్థాయిలను తనిఖీ చేయండి, శుభ్రమైన ఇంజిన్‌ను నిర్వహించండి)

Table of Contents

తక్కువ పెట్రోల్ తో ఎక్కువ మైలేజ్ పొందడం ఎలా?

బైక్ లేదా కార్ లేనిదే బయటికి వెళ్ళలేని స్థితికి వచ్చాం. రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సామాన్యుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎక్స్పర్ట్స్ అంచనాల ప్రకారం 2025 పెట్రోల్ లీటర్ 140కి చేరుకునే అవకాశం ఉంది. పెట్రోల్ డీజిల్ ధరల వలన ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే పెట్రోల్ మరియు డీజిల్ ని ఆదా చేయడం ఎలా (Reduce Fuel Consumption) మరియు తక్కువ ఫ్యూయల్ తో మీ వాహనాన్ని ఎక్కువ మైలేజ్ తో పరుగులు పెట్టడం ఎలా ఈ ఆర్టికల్లో వివరించడానికి ప్రయత్నిస్తున్నాం.

పెట్రోల్ మరియు డీజిల్ ని ఆదా చేయండి ఇలా (How to Reduce Fuel Consumption)

భారతదేశంలో రోజుకు 4.98 మిలియన్ బ్యారెల్స్ చమురు వినియోగం జరుగుతుందని ఎకనామిక్ టైమ్స్ తన ఆర్టికల్లో తెలిపింది. ఇలా రోజు రోజుకి చమురు వినియోగం పెరిగితే పెట్రోల్ ధర లీటర్ 300 కి చేరుకున్న ఆశ్చర్యం లేదు. ఒక సగటు భారతీయ పౌరుడిగా పెట్రోల్ ని ఆదా చేయటం ప్రతి ఒక్కరికి కర్తవ్యంగా భావించాలి. దీనివలన మన వ్యక్తిగత ఖర్చులు కూడా తగ్గుతాయి అంతేకాకుండా నిత్యావసర ధరలు కూడా మనం చమురు ను ఆదా చేయటం వల్ల తగ్గుతాయి. చమురును ఎలా ఆదా చేయాలో చూద్దాం.

సరైన స్నిగ్ధతను ఎంచుకోండి (Choose the right viscosity)

చమురును ఆదా చేయడానికి ఇది ఒక మంచి టిప్ గా చెప్పవచ్చు. సరైన స్నిగ్ధత ను తెలుసుకోవడం వల్ల కారు ఇంజన్లో ఘర్షణ తగ్గి చమురు ఆదా అవుతుంది. మీ కార్ మోడల్ కు సంబంధించి సరైన స్థితి ను మీరు కారు కొనుక్కున్నప్పుడు మీకు ఇచ్చిన యూజర్ మాన్యువల్ లో చూడండి.

సింథటిక్ నూనెలను ఉపయోగించండి (Use synthetic oils)

మార్కెట్లో లభించే సింథటిక్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల చమురు బాగా ఆదా అవుతుంది. సింథటిక్ ఆయిల్ ఇంజన్ ఘర్షణను బాగా తగ్గించి చమురు వినియోగాన్ని తగ్గిస్తుంది తద్వారా మీకు చమురు ఆదా అవుతుంది. భారతదేశంలో సింథటిక్ ఆయిల్ ప్రధాన కంపెనీలు వాల్వోలిన్ ఇంజిన్ ఆయిల్, మోటుల్ ఇంజిన్ ఆయిల్, క్యాస్ట్రోల్, గల్ఫ్, షెల్, హోండా, మొబిల్ 1, వీడోల్, సర్వో, GS కాల్టెక్స్ మరియు మరెన్నో బ్రాండ్లు మార్కెట్లో లభిస్తున్నాయి.

రెగ్యులర్ చమురు మార్పులు (Regular oil changes)

మీ కారు మ్యానుఫ్యాక్చరర్స్ సూచనల మేరకు తరచూ ఇంటర్వెల్ విధానాన్ని అనుసరిస్తూ ఆయిల్ ను మార్చుకుంటూ ఉండండి. కొత్త ఆయిల్ ఇంజన్ యొక్క సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా సరైన లూబ్రికేషన్ ను నిర్ధారిస్తుంది అంతేకాకుండా మీ చమురును ఆదా చేయడానికి ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Also Read : ఇండియా లో డిమాండ్ ఉన్న అతి ముఖ్యమైన ఎలక్ట్రిక్ కార్లు 2024

చమురు స్థాయిలను తనిఖీ చేయండి (Check oil levels)

మీ కారు కంపెనీ సూచనల మేరకు మీ కారు యొక్క చమురు (oil) లెవెల్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. తక్కువ ఆయిల్ లెవెల్స్ కారు యొక్క ఇంధన సామర్ధ్యాన్ని తగ్గించి ఘర్షణను పెంచుతాయి.

శుభ్రమైన ఇంజిన్‌ను నిర్వహించండి (Maintain a clean engine)

ఇంజన్ ను శుభ్రంగా ఉంచుకోవడం ఎంతగానో ముఖ్యం. అధిక నాణ్యత గల ఆయిల్ ఫిల్టర్ లను ఉపయోగించటం, ఎయిర్ ఫిల్టర్లను శుభ్రపరచుకోవడం లేదా ఎయిర్ ఫిల్టర్ లను మార్చుకోవడం ద్వారా చమురును బాగా ఆదా చేసుకోవడమే కాకుండా ఇంధన సామర్థ్యాన్ని కూడా పెంచుకోవచ్చు.

ఇంధన-సమర్థవంతమైన డ్రైవింగ్ టెక్నిక్‌లను ఉపయోగించండి (Use fuel-efficient driving techniques)

డ్రైవింగ్ టెక్నికల్ ద్వారా కూడా ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. ఉన్నట్లుండి కారు వేగం (Accelarate)పెంచడం, హార్డ్ బ్రేకులు వేయడం, ఒక నిర్దిష్టమైన కారు వేగాన్ని మెయింటెన్ చేయకపోవడం వంటి పనులు మీ చమురును ఎక్కువగా ఖర్చు చేస్తాయి. కారులో ఎయిర్ కండిషనర్ పొదుపుగా వాడటం వలన కూడా మీ ఫ్యూయల్ ఆదా అవుతుంది. మీ కారు టైర్ల మీద అనవసరమైన ఒత్తిడిని లేదా బరువును తగ్గించడం ద్వారా కూడా ఆయిల్ ను ఆదా చేయవచ్చు.

టాప్ 5 సింథటిక్ ఆయిల్ బ్రాండ్స్ (Top 5 Synthetic Oil Brands)

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మరియు అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 5 సింథటిక్ ఆయిల్ మరియు వాటి ధరల వివరాలు :

మొబిల్ 1 (Mobil1)

అద్భుతమైన ఇంజన్ రక్షణ మరియు ఇంధన సామర్థ్యాన్ని అందించే అధునాతన సింథటిక్ ఆయిల్ కు ప్రసిద్ధి చెందింది.

క్యాస్ట్రోల్ ఎడ్జ్ (Castrol Edge)

క్యాస్ట్రోల్ ఎడ్జ్ ఆధునిక ఇంజిన్‌ల కోసం రూపొందించిన అధిక-పనితీరు గల సింథటిక్ ఆయిల్ లను అందిస్తుంది, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాద శాతాన్ని తగ్గిస్తుంది.

షెల్ హెలిక్స్ అల్ట్రా (Shell Helix Ultra)

ఇంజిన్‌లకు అధునాతన సింథటిక్ లూబ్రికేషన్‌ను అందిస్తుంది, ఇంజన్లను క్లీన్ గా ఉంచడంలో మరియు చమురును పొదుపు చేయడంలో ఉపయోగపడుతుంది.

వాల్వోలిన్ సిన్‌పవర్ (Valvoline SynPower)

మెరుగైన ఇంజిన్ రక్షణ, తగ్గిన ఘర్షణ మరియు మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందించే సింథటిక్ ఆయిల్ లకు ప్రసిద్ధి చెందింది.

టోటల్ క్వార్ట్జ్ (Total Quartz)

సరైన ఇంజన్ పనితీరు మరియు ఇంజన్ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా దాని యొక్క పనితీరును చాలాకాలం కొనసాగించేలా చేస్తుంది. ఈ కంపెనీ సింథటిక్ ఆయిల్ అడ్వాన్స్ టెక్నాలజీకి పేరుగాంచింది.

ముగింపు (Conclusion On Reduce Fuel Consumption)

పైన తెలిపినట్లు సరైన స్నిగ్ధత ను ఎంచుకోవడం ద్వారా, సింథటిక్ ఆయిల్ ను వాడటం ద్వారా రెగ్యులర్గా చమురును మార్చడం ద్వారా మరియు సరైన డ్రైవింగ్ టెక్నిక్స్ వాడటం ద్వారా మనం చమురును ఆదా చేయవచ్చు. ఈ ఆర్టికల్ మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాము.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ: Reduce Fuel Consumption)

చమురును ఎలా ఆదా చేయాలో చదివారు కదా ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రశ్నలు ఏమన్నా ఉంటే క్రింద కామెంట్లో తెలపండి. మా వెబ్సైట్ వీక్షకులు అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఈ క్రింద ఇవ్వబడినవి.

What can we do to reduce the use of fuel?

స్నిగ్ధత ను ఎంచుకోవడం ద్వారా, సింథటిక్ ఆయిల్ ను వాడటం ద్వారా మరియు సిగ్నల్స్ వద్ద వాహనాలను స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా కూడా చమురుని ఆదా చేయవచ్చు

Does AC consume fuel?

AC బాగా వాడటం వల్ల 20% అధిక చమురు ఖర్చవుతుంది. కారు యొక్క స్పేస్ మరియు వాతావరణ స్థితులు కూడా ఏసి వాడకం తద్వారా చమురు వాడకాన్ని నిర్ణయిస్తాయి.

What are the top 5 synthetic oils to reduce fuel consumption ?

మొబిల్ 1, క్యాస్ట్రోల్ ఎడ్జ్, షెల్ హెలిక్స్ అల్ట్రా, వాల్వోలిన్ సిన్‌పవర్ మరియు మరియు టోటల్ క్వార్ట్జ్.

Leave a Comment