Android Phone VS iphone: ఏ మొబైల్ కొనాలో కన్ఫ్యూజన్లో ఉన్నారా……. అయితే తెలుసుకోండి

Android VS iphone, Introduction, Conclusion, FAQ (పనితీరు, రీ సేల్, సెక్యూరిటీ, ఇకో సిస్టం, కెమెరా, స్టీరియో మైక్, గేమింగ్, యూజర్ ఫ్రెండ్లీ, సర్వీస్ కాస్ట్, స్టోరేజ్)

Android VS iphone

Android phone కొనాలా లేకపోతే iphone కొనాలా చాలామందికి కన్ఫ్యూషన్ అయితే ఉంటది. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువ అయితే మాత్రం తక్కువ కన్ఫ్యూషన్ ఉంటది ఎందుకంటే అప్పుడు మీ ఆప్షన్ ఆండ్రాయిడ్ ఫోన్ మాత్రమే అవుతుంది కాబట్టి. కానీ ఎప్పుడైతే మీ బడ్జెట్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఆప్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వీటిలో ఏ mobile phone చూస్ చేసుకోవాలి అని.

Also Read: రోల్ చేయగల స్మార్ట్ఫోన్లు ఉన్నాయని మీకు తెలుసా……. ఇది ఒక అద్భుత ఆవిష్కరణ

అలా కన్ఫ్యూజ్ అయ్యే వారిలో మీరు ఉంటే ఈ article ని చివరి వరకు చదివిన తర్వాత మీకు android phone తీసుకోవాలా లేక iphone అనే విషయంపై పూర్తి క్లారిటీ వస్తుంది.

ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్ ఎలా ఎంచుకోవాలి (Android phone or iPhone)

ఉత్తమంగా అభివృద్ధి చెందుతున్న అటువంటి భారతదేశంలో మిగిలిన విషయాల లాగానే మొబైల్ రంగంలో android phone గొప్పవా లేదా iphones గొప్పవా అనే విషయం మీద ఆర్గ్యుమెంట్స్ నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఆండ్రాయిడ్ ఫోన్ గొప్పది అని ఆండ్రాయిడ్ యూజర్స్ అలాగే iphone ఏ గొప్పదని యూజర్స్ ఎప్పుడు డిబేట్స్ చేస్తూనే ఉంటారు. మరి గందరగోళ మైన మొబైల్ రంగంలో ఎవరికి ఏ రకమైన ఫోన్ సరిగ్గా సరిపోతుంది మరియు ఈ రెండింటిలో ఉన్న ముఖ్యమైన ఫీచర్స్ అలాగే ఈ రెండింటిలో ఏ mobile phone చూస్ చేసుకోవాలి ఇలాంటి విషయాలను వివరించాము.

పనితీరు (performance)

ఫస్ట్ ఎందుకు iphone బెస్ట్ అంటే ఐఫోన్ లో మీకు లైఫ్ ఎక్కువ ఉంటుంది. అంటే మీరు కంటిన్యూగా ఎంత సమయం వరకు యూస్ చేసిన కానీ నీటుగా రన్ అవుతూ ల్యాగ్ అవ్వడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఇట్లాంటివి అయితే మీకు ఐ ఫోన్స్ లో అయితే ఉండవు. ఇది మీకు iphones లో పెద్ద ప్లస్ పాయింట్ దీనివల్ల mobile phone లాంగ్ రన్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా రన్ అవుతుంది.

ఇప్పుడు android phone గురించి మాట్లాడుకుంటే ఇందులో కొన్ని నెలల తరువాత వచ్చే అప్డేట్స్ వలన ఫోన్ ల్యాగ్ అవ్వడం మరియు పర్ఫామెన్స్ తగ్గిపోవడం జరుగుతుంది. లాంగ్ రన్ అనేది మీకు ఆండ్రాయిడ్ ఫోన్లో ఉండదు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి అదేంటంటే android phones లో వన్ ప్లస్ మొబైల్స్ మాత్రమే చాలా లాంగ్ రన్ కలిగి ఉంటాయి అందువలన మాత్రమే వన్ ప్లస్ మొబైల్స్ ఈ ప్రపంచంలో పాపులారిటీని సంపాదించుకున్నాయి.

రీ సేల్ (resale)

రీ సేల్ విషయానికి వస్తే iphone కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మంచి వ్యాల్యూ కి రీ సేల్ చేయొచ్చు డబ్బులు కూడా బాగా వస్తాయి అదే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ విషయానికి వస్తే మార్కెట్లో రి సేల్ వాల్యూ కూడా తక్కువగా ఉంటుంది.

సెక్యూరిటీ (security)

ఇక నెక్స్ట్ సెక్యూరిటీ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫామ్ కనుక ఎవరైనా యాప్స్ ఇందులో పెట్టడానికి ఆస్కారం ఉంది కనుక మాల్వేర్ అటాక్స్ కూడా ఈజీగా జరుగుతుంటాయి అదే ఐఫోన్లో సెక్యూరిటీ సిస్టం అనేది అత్యాధునిక పద్ధతిలో ఉంటుంది మాల్వేర్ అటాక్స్ కూడా అంత ఈజీగా అవ్వవు.

ఇకో సిస్టం (eco system)

ఒక వేళ మీరు Apple phone యూస్ చేస్తున్నారు అనుకోండి ఆపిల్ డివైసెస్ సింక్ లో ఉండి మీకు కలిసి వర్క్ అవుతాయి అంటే for example ఐఫోన్లో ఒక ఫోటో తీస్తే ఐపాడ్ కి సింక్ ఉంటుంది అలాగే ఆపిల్ ఐడి సింక్ ఉన్న అన్ని డివైసెస్ డ్ లో కూడా ఆ ఫోటో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎయిర్ డ్రాప్ యూస్ చేసి మిగిలిన వేరే ఆపిల్ డివైసెస్ కి కూడా డాటా షేర్ చేసుకోవచ్చు. కనుక ఇది ఇంకొక అద్భుతమైన అందరికీ ఉపయోగపడే ఫీచర్.

కెమెరా (camera)

ఇక కెమెరా విషయానికి వస్తే iphones మరియు android phones కూడా అత్యాధునికమైన కెమెరా హార్డ్వేర్ ని కలిగి ఉండి అద్భుతమైన ఫొటోస్ ని తీసుకోవడానికి అనువుగా తయారు చేయబడుతున్నాయి. ఈ రెండు మొబైల్స్ కి కెమెరా విషయంలో అంత ఎక్కువగా వ్యత్యాసం లేదు.

ఐఫోన్ లో సరిగా లేనిది ఆండ్రాయిడ్ లో ముఖ్యంగా ఉన్నది ఫ్రంట్ కెమెరా క్వాలిటీ ఆండ్రాయిడ్ లో ఫ్రంట్ కెమెరా క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది కనుక ఎవరికైతే ఫ్రంట్ కెమెరా ప్రయారిటీ ఉంటుందో వారు మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే సమయంలో ఇది తెలుసుకోవడం తప్పనిసరి.

స్టీరియో మైక్ (stereo mic)

Android phone లో లేనిది ఐఫోన్లో ఉన్నది మరొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే అది స్టీరియో మైక్ ఇది మీకు బాగుంటుంది. ఎవరైతే రికార్డింగ్ పర్పస్ గురించి మొబైల్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారో వాళ్లకి ఈ స్టీరియో మైక్ చాలా ఉపయోగపడుతుంది.

ఎవరైతే షో ఆఫ్ చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు వాళ్లకి ఈ ఆపిల్ లోగోతో ఉన్న ఐ ఫోన్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ ఆండ్రాయిడ్ మొబైల్ వాడే వారి నుండి ఆపిల్ ఫోన్ వాడే వినియోగదారులు కొంచెం ఎక్కువగా లాభాన్ని పొందుతారు.

గేమింగ్ (gaming)

ఒకవేళ మీరు గేమర్ అయి ఉండి గేమ్స్ ఎక్కువగా ఆడుతూ ఉంటే మాత్రం తప్పకుండా iphone కొనుగోలు చేయడానికి ఇష్టపడండి ఎందుకంటే ఐఫోన్స్ అనేవి గేమ్స్ ఆడటానికి అవసరమయ్యే హార్డ్వేర్ ని కలిగి ఉండి అనుకూలంగా తయారు చేయబడ్డాయి.  అదే android phone విషయానికి వస్తే గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటే చాలా తక్కువ సమయంలోనే ఫోన్స్ హ్యాంగ్ అవడం స్లో అవ్వడం జరుగుతుంది.  అందువల్ల గేమర్స్ లేదా స్ట్రీమింగ్ చేసే వాళ్ళు వాళ్లకి ఆండ్రాయిడ్ ఫోన్ కాకుండా ఐఫోన్ చాలా అనువుగా ఉంటుంది. కనుక గేమర్స్ గేమ్స్ ని ఎక్కువ ఇష్టపడేవాళ్లు తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవడం వల్ల మీరు ఒక అత్యంత ఎక్కువగా ఉపయోగపడే మొబైల్ ఫోను కొనుగోలు చేసిన వారవుతారు.

యూజర్ ఫ్రెండ్లీ (user friendly)

ముఖ్యంగా android phone నుండి iphone కి అప్డేట్ అయినవారు కొంత సమయం వరకు ఐఫోన్ను తిడుతూ తక్కువ చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఐఫోన్ అలవాటు అవటానికి సమయం పడుతుంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లో ఉండే చాలా రకాల ఫీచర్స్ ఐఫోన్ లో ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ యాప్ లాక్ చేసుకోవచ్చు మరియు రెండు whatsapp లు యూస్ చేసుకోవచ్చు రకరకాల కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు ఇలాంటి ఏ ఫీచర్స్ మీకు ఐఫోన్ లో ఉండవు.

సర్వీస్ కాస్ట్ (service cost)

ఇక సర్వీస్ కాస్ట్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ ఫోన్స్ తో పోలిస్తే ఐ ఫోన్స్ లో చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ క్రిందపడి గ్లాస్ డామేజ్ అయిన లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఫోన్ సరిగ్గా పని చేయకపోయినా మీరు సర్వీస్ సెంటర్ కి వెళ్లిన తర్వాత ఎక్కువ మొత్తంలో సర్వీస్ చార్జ్ చేయబడుతుంది ఇది ఒక పెద్ద నెగిటివ్ పాయింట్ కనుక ఈ విషయాన్ని వినియోగదారులు దృష్టిలో ఉంచుకోగలరు.

స్టోరేజ్ (storage)

ఐ ఫోన్స్ లో స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వబడదు కనుక ఎవరైతే ఎక్కువ స్టోరేజ్ ఐఫోన్ కొనుగోలు చేస్తారు వాళ్లకి కొంత సమయానికి స్టోరేజ్ కి సంబందించిన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కనుక ఐఫోన్ కొనుగోలు సమయంలోనే ఎక్కువ స్టోరేజ్ ఉన్నటువంటి మొబైల్ చూస్ చేసుకుంటే ఎటువంటి అంతరాయం లేకుండా ఎక్కువ సమయం వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

ప్రైస్ (price)

ఆండ్రాయిడ్ ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే ఐ ఫోన్స్ చాలా ఎక్కువ ధరలో ఉంటాయి కనుక ఇది అందరి వినియోగదారులకు అందుబాటులో ఉండకపోవచ్చు ముఖ్యంగా ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నటువంటి మన భారతదేశంలో.

ముగింపు (Conclusion On Android VS iphone)

ముగింపు కి వస్తే ఐ ఫోన్స్ మరియు ఆండ్రాయిడ్ ఫోన్స్ వీటిలో వేటికవే ప్రత్యేకం. అలాగే వినియోగదారుల అభిరుచులు కూడా వేరుగా ఉంటాయి కనుక ఎవరైతే మొబైల్ కొనుగోలు చేయాలని అనుకుంటారో వారు పైన చెప్పబడిన వివిధ రకాల విషయాలను దృష్టిలో ఉంచుకొని తగిన మొబైల్ ఫోన్ కొనుగోలు చేయగలరు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ: Choosing Android VS iphone)

ఎవరైనా సరే మొబైల్ కొనుగోలు చేసే ముందు వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం తప్పకుండా చేయాల్సిన విషయం అందువలన వీక్షకులు అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు పొందుపరచాము.

Which is better, iPhone or Android?

వ్యక్తిగత ఇష్టాలు మరియు అవసరాలకు అనుగుణంగా ఉంటుంది.

Why do people choose Android over iPhone?

అనుకూలతలు, అధికమైన అదనపు ధరలు మరియు వివిధ స్థితులకు అనుకూలంగా డివైస్‌లను అందిస్తుంది.

Is it worth switching to iPhone from Android?

వ్యక్తిగత ఇష్టాలు మరియు ముఖ్యతః ప్రాధాన్యాలను ఆధారించి ఉంటుంది.

Leave a Comment