Luxury Cars, Top 10 Luxury Cars in India , Conclusion, FAQ (మినీ కూపర్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్, బీఎండబ్ల్యూ ఎక్స్ 1, టయోటా ఫార్చునర్, మెర్సిడెస్ బెంజ్ ఏ క్లాస్ లిమోసిన్, ల్యాండ్ రోవర్ డిఫెండర్, టయోటా క్యామ్రీ..)
హలో బాగున్నారా ఈరోజు మీకు ఈ ఆర్టికల్లో అద్భుతమైన విలాసవంతమైన కార్లను పరిచయం చేస్తున్నాం. భారతదేశంలో 2024లో ఎక్కువగా ఆదరణ పొందుతున్న ఖరీదైన మరియు విలాసవంతమైన కార్ల (Luxury Cars) వివరాలను మీకు అందిస్తున్నాం. అంతేకాకుండా కార్ల యొక్క ఫీచర్లను మరియు వాటి మార్కెట్ ధరలను మీకు అవగాహన కోసం అందిస్తున్నాం.
ఖరీదైన కార్ల విభాగంలో అత్యంత ఆదరణ పొందుతున్న కూపర్, రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ, టొయోట ఫార్చునర్, మెర్సిడెస్ బెంజ్ స్కోడా ,ఆడి వంటి ప్రముఖ మోడల్ ల వివరాలను మీకు తెలియజేస్తున్నాము.
అద్భుతమైన విలాసవంతమైన కార్లు (Top 10 Luxury Cars in India )
భారతదేశంలో కూడా లగ్జరీ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది.ఉదాహరణకు మెర్సిడెస్ బెంజ్ గత ఆర్థిక సంవత్సరం 18,123 లగ్జరీ కార్లను విక్రయించింది అలానే 2024 మొదటి త్రైమాసికంలో 5412 యూనిట్లను విక్రయించి రికార్డ్ సృష్టించింది. బీఎండబ్ల్యూ 2024 మొదటి త్రైమాసికంలో 3512 యూనిట్లను విక్రయించి 51% ఎదుగుదలను నమోదు చేసింది. ఆడి గత ఆర్థిక సంవత్సరంలో 7027 యూనిట్లను విక్రయించింది ఇలా లగ్జరీ కార్స్ అందించే అన్ని ప్రముఖ కంపెనీలు రికార్డ్ స్థాయిలో విక్రయాలు చేస్తున్నాయి.కొన్ని ముఖ్యమైన అత్యధిక ఆదరణ పొందిన లగ్జరీ కార్ల వివరాలను తెలియజేస్తున్నాము.
Also Read : కారు కొనే ముందు చూడవలసిన ముఖ్యమైన భద్రత సౌకర్యాలు మరియు ప్రాముఖ్యత
మినీ కూపర్ (Mini Cooper)
Image Source : carwale
మినీ కూపర్ అత్యాధునిక సాంకేతికత కలిగిన కారు అంతేకాకుండా ప్రత్యేకమైన డిజైన్ మరియు చురుకైన హ్యాండ్లింగ్ తో అయ్యర్ అండ్ కార్స్ లో బాగా పేరు గడించింది. కూపర్ వాస్తవానికి బ్రిటిష్ మోటర్ కార్పొరేషన్ బీఎండబ్ల్యూ చేతికి వెళ్ళింది.
మినీ కూపర్ లో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కూపర్ కేవలం నగరాలకు డిజైన్ చేయబడిన కారు లాగా అనుకుంటారు కానీ ఇది ఎక్కువ మలుపులు ఉన్న రోడ్లు మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా సౌకర్యవంతంగా ప్రయాణం చేయగలదు. కూపర్ కాంపాక్ట్ ప్యాకేజీలో స్టైల్ మరియు సమ్మేళనంతో డిజైన్ చేయబడింది. అంతేకాకుండా కూపర్ అత్యాధునిక టర్బో చార్జర్ ఇంజన్లు మరియు ఇన్ఫోటైన్మెంట్ సిస్టం తో కూడిన ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ తో డిజైన్ చేయబడినది. కూపర్ 1.5 లీటర్ జంతువు కూడిన కన్వర్టబుల్ వేరియంట్లు కలిపి దాదాపు 29-32 MPGని సాధించగలవు, అయితే 2.0-లీటర్ ఇంజన్‌తో కూడిన కూపర్ S కన్వర్టిబుల్ 26-29 MPG కలిపి పొందవచ్చు.
మినీ కూపర్ మార్కెట్ ధర : 41.95 Lakhs
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్ (Land Rover Range Rover Velar)
Image Source : carwale
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్ అనేది ల్యాండ్ రోవర్ యొక్క లైనప్‌లోని రేంజ్ రోవర్ ఎవోక్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్ మధ్య ఉండే ఒక లగ్జరీ SUV. ఇది సొగసైన మరియు ఆధునిక డిజైన్, అధునాతన సాంకేతిక లక్షణాలు మరియు ల్యాండ్ రోవర్ వాహనాలకు విలక్షణమైన ఆఫ్-రోడ్ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది.
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెల్లర్ అత్యాధునిక డిజైన్ కలిగిన కారు ఇది క్లీన్ లైన్లు అలానే అవసరమైనప్పుడు పాప్ అవుట్ అయ్యే ప్లే స్టోర్ హ్యాండిల్స్ తో అందంగా డిజైన్ చేయబడింది. అత్యధిక నాణ్యత కలిగిన మెటీరియల్తో తయారు చేయబడిన ఈ కారు విలాసవంతమైన మరియు సరికొత్త ఇన్ఫోటైన్మెంట్ అలానే డ్రైవర్ అసిస్టెంట్ సిస్టంలను కలిగి ఉంటుంది.ప్రీమియం కార్ల కోసం అన్వేషిస్తున్న వినియోగదారులకు ఈ కారు మంచి ఎంపిక అని చెప్పవచ్చు.ఈ కారుకు ఉన్న 2.0-లీటర్ నాలుగు-సిలిండర్ డీజిల్ ఇంజన్ మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందజేస్తుంది, సుమారుగా 25-30 mpg సామర్థ్యం కలిగి ఉంటుంది మరియు 3.0-లీటర్ ఆరు-సిలిండర్ డీజిల్ ఇంజన్ 22-28 mpg వరకు సాధించగలదు.
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్ మార్కెట్ ధర : 87.90 Lakhs
బీఎండబ్ల్యూ ఎక్స్ 1 (BMW X1 )
Image Source : carwale
బీఎండబ్ల్యూ ఎక్స్ 1 కార్ల ఉత్పత్తి కంపెనీ అయిన బీఎండబ్ల్యూ చే ఉత్పత్తి చేయబడిన ఒక కాంటాక్ట్ లక్సరీ క్రాస్ ఓవర్ SUV. X1 సాధారణంగా గ్యాస్ డీజిల్ ఇంజన్లతో సహా అనేక రకాల ఇంజన్లు తో కూడిన మోడల్ లను కలిగి ఉంటుంది. BMW X1 అత్యాధునికంగా డిజైన్ చేయబడిన కారు అంతే కాకుండా విలక్షణమైన కిడ్నీ గ్రిల్ సొగసైన హెడ్లైట్లు మరియు రూపంలో స్టైలిష్ గా డిజైన్ చేయబడింది.
BMW X1 అత్యధికంగా ప్రతిస్పందించే స్టీరింగ్ మరియు మృదువైన అనుభూతిని ఇస్తుంది. అలానే ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీతో ట్రాక్షన్ మరియు స్థిరత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది దీనివలన క్లిష్టమైన రోడ్ల ప్రయాణాన్ని సైతం సులభతరం చేస్తుంది.
గ్యాసోలిన్ ఇంజిన్‌తో కూడిన BMW X1 సాధారణంగా సిటీ డ్రైవింగ్‌లో గాలన్‌కు 23-24 మైళ్లు (mpg) మరియు హైవేలో 31-33 mpgని సాధిస్తుంది. డీజిల్ ఇంజన్ సుమారుగా 27-29 mpg మరియు హైవే ప్రయాణంలో 36-39 mpg సాధించగలదు.
బీఎండబ్ల్యూ ఎక్స్ 1 మార్కెట్ ధర : 49.50 Lakhs
టయోటా ఫార్చునర్ (Toyota Fortuner )
Image Source : carwale
టయోటా ఫార్చునర్ ను జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ విశాలమైన క్యాబిన్ మరియు స్టైలిష్ ఇంటీరియర్ తో డిజైన్ చేయబడింది. ఫీచర్స్ విషయానికి వస్తే అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఉంటాయి, అలాగే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్, లెదర్ అప్హోల్స్టరీ మరియు క్లైమేట్ కంట్రోల్ వంటి సౌకర్యాలు ఉంటాయి.
టయోటా ఫార్చునర్ డీజిల్ మోడల్ లీటరుకు 10 నుంచి 14 కిలోమీటర్ల వరకు మైలేజ్ ని ఇస్తుంది అదేవిధంగా పెట్రోలియం లీటరుకు ఏడు నుంచి పది కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగల దు. హైబ్రిడ్ మోడల్ అయితే కనుక లీటరుకు నుంచి 16 కిలోమీటర్ల వరకు మైలేజ్ ని ఇస్తుంది.
టయోటా ఫార్చునర్ మార్కెట్ ధర : 38.21 Lakhs
మెర్సిడెస్ బెంజ్ ఏ క్లాస్ లిమోసిన్ ( Mercedes-Benz A-Class Limousine)
Image Source : carwale
మెర్సిడెస్ బెంజ్ ఏ క్లాస్ లిమోసిన్ జర్మన్ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ ఉత్పత్తి చేస్తుంది. ఏ క్లాస్ లిమోసిన్ అత్యంత ఆదరణ పొందుతున్న Luxury Cars లో ఒకటి. A-క్లాస్ లిమౌసిన్ మెర్సిడెస్-బెంజ్ వాహనాలకు విలక్షణమైన అధునాతన సాంకేతికత మరియు సౌకర్యవంతమైన లక్షణాలతో సొగసైన డిజైన్ అంశాలను మిళితం చేస్తుంది.లిమోసిన్ చాలా స్టైలిష్ గా మరియు సరికొత్త హంగులతో డిజైన్ చేయబడింది. ఫీచర్ల విషయానికి వస్తే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, Mercedes-Benz యొక్క MBUX ఇంటర్‌ఫేస్‌తో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వాయిస్ కమాండ్ ఫంక్షనాలిటీ, స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ మరియు వివిధ డ్రైవర్ సహాయ వ్యవస్థలతో సహా సరికొత్త సాంకేతికతను కలిగి ఉంది.
మెర్సిడెస్ బెంజ్ ఏ క్లాస్ మైలేజీ విషయానికి వస్తే పెట్రోల్ మోడల్ కార్ లీటర్ కు 17.5 కిలోమీటర్లు వరకు ప్రయాణం చేయగలదు. అంతేకాకుండా మరింత మైలేజ్ కొరకు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగాన్ని మెయింటైన్ చేయగలిగితే మరింత మైలేజ్ ఇస్తుంది.
మెర్సిడెస్ బెంజ్ ఏ క్లాస్ లిమోసిన్ మార్కెట్ ధర : 46.05 Lakhs
ల్యాండ్ రోవర్ డిఫెండర్ (Land Rover Defender )
Image Source : carwale
ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఒక వినూత్నమైన ఆవిష్కరణ. సుదీర్ఘ చరిత్ర కలిగిన ల్యాండ్ చే డిజైన్ చేయబడిన అత్యాధునిక Luxury Cars లో ప్రముఖమైనది. అనేక మార్పులు మరియు నూతన టెక్నాలజీతో రూపొందించిన ఆఫ్ రోడ్ కార్ గా పేరు గడించింది.
డిఫెండర్ బాక్సీ డిజైన్, హై గ్రౌండ్ క్లియరెన్స్ మరియు అధునాతన ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఈ మోడల్ కారు టైం లెస్ డిజైన్ కు విలువనిచ్చే వినియోగదారునికి ఎంతగానో నచ్చుతుంది. మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ మోడల్ 6.8 kmpl – 9.3 kmpl డీజిల్ మోడల్ 11.40 kmpl – 13.20 kmpl మరియు హైబ్రిడ్ మోడల్ 40.0 kmpl వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ మార్కెట్ ధర : 93.55 Lakhs
రేంజ్ రోవర్ ఎవోక్ (Land Rover Range Rover Evoque)
Image Source : carwale
రేంజ్ రోవర్ ఎవోక్ అనేది ల్యాండ్ రోవర్ ఉత్పత్తి చేసిన స్టైలిష్ మరియు కాంపాక్ట్ లగ్జరీ SUV కారు. ఇది అందమైన డిజైన్ మరియు అద్భుతమైన ఇంటీరియర్ కలిగి ఉంది. Evoque మొట్టమొదట 2011లో ప్రవేశపెట్టబడింది. ఎవోక్ ఎప్పటికప్పుడు సాంకేతికతను మెరుపు పరుచుకుంటూ సరికొత్త మోడల్ లను మార్కెట్లోకి ప్రవేశ పెడుతుంది. ఫీచర్ల విషయానికి వస్తే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లు మరియు వివిధ డ్రైవర్-అసిస్ట్ మరియు అధునాతన సాంకేతికతతో కూడిన విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన క్యాబిన్‌ను కలిగి ఉంటుంది.
రేంజ్ రోవర్ ఎవోక్ యొక్క మైలేజీ పెట్రోల్ మోడల్ అయితే 25 to 30 mpg, డీజిల్ మోడల్ అయితే 30 to 40 mpg మరియు హైబ్రిడ్ మోడల్ 50 mpg లను కలిగి ఉంటుంది
రేంజ్ రోవర్ ఎవోక్ మార్కెట్ ధర : 67.90 Lakhs
టయోటా క్యామ్రీ (Toyota Camry)
Image Source : carwale
టయోటా క్యామ్రీ సాధారణంగా సంవత్సరాన్ని బట్టి వివిధ రకాల ఫీచర్స్ తో అనేక రకాల మోడల్ లను కలిగి ఉంది. క్యామ్రీ అత్యాధునిక మరియు అధునాతన మోడల్ అని చెప్పవచ్చు. టయోటా క్యామ్రీ ప్రీ-కొలిజన్ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ అలర్ట్‌తో పాటు స్టీరింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ హై బీమ్‌లు వంటి సదుపాయాలతో పాటు సేఫ్టీ సెన్స్ P (TSS-P) వంటి భద్రతా లక్షణాలతో అమర్చబడి ఉంటుంది.
టయోటా క్యామ్రీ మోడల్ ని బట్టి మైలేజ్ ను నిర్ధారిస్తుంది. సిలిండర్ మోడల్ అయితే 25-350 mpg, V6 ఇంజన్ అయితే 20-30 mpg హైబ్రిడ్ క్యామ్రీలు 40-50+ mpg సామర్థ్యం కలిగి ఉంటాయి.
టయోటా క్యామ్రీ మార్కెట్ ధర : 46.17 Lakhs
ఆడి ఎ4 (Audi A4)
Image Source : carwale
ఆడి ఎ4 మంచి ఇంజన్ సామర్థ్యం మరియు అధునాతన ఇంటీరియర్ తో తయారు చేయబడిన ఆడి వారి ప్రీమియం Luxury Car. ఆడి కారు 1994 నుంచి చాలా ప్రసిద్ధి చెందిన కాంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ కార్. ఆడి a4 అత్యాధునిక భద్రత ఫీచర్స్ కలిగి ఉంటుంది డ్రైవర్ సహాయ సాంకేతికతలతో పాటు, A4 తరచుగా బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేక్‌లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటి ప్రామాణిక భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది.
అంతేకాకుండా ఎంతో అందమైన ఏరో డైనమిక్ ప్రొఫైల్ LED హెడ్‌లైట్లు మరియు టైల్‌లైట్లు, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, అడాప్టివ్ సస్పెన్షన్, స్పోర్ట్ సీట్లు మరియు అధునాతన లైటింగ్ ప్యాకేజీల వంటి అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఆడి యొక్క ఇంధన సామర్థ్యం 40 to 50 mpg మరియు అంతకన్నా ఎక్కువ మోడల్స్ బట్టి ఉంటుంది అంతేకాకుండా అధునాతన డీజిల్ సిస్టం కలిగిన కారు ఆడియో a4.
ఆడి ఎ4 మార్కెట్ ధర : 45.34 Lakhs
స్కోడా సూపర్బ్ (Skoda Superb)
Image Source : carwale
పేరుకు తగ్గట్టుగానే ఇది సూపర్ లగ్జరీ కార్. స్కోడా సూపర్ కార్ 1990ల చివరి నుండి వోక్స్వ్యాగన్ గ్రూపులో భాగమైన స్కోడా కంపెనీకి సంబంధించిన మంచి పేరు గాంచిన మోడల్.
ఈ కారు మంచి స్పేస్ కలిగిన క్యాబిన్ తో తయారు చేయబడింది. కుటుంబ సమేతంగా ప్రయాణించడానికి ఈ కారు ఎంతో సౌకర్యవంతమైనది. ఫీచర్స్ విషయానికి వస్తే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు మరియు కనెక్టివిటీ ఆప్షన్‌ల వంటి అనేక రకాల సాంకేతిక లక్షణాలను కలిగి ఉంటుంది.
సౌకర్యవంతమైన ప్రయాణం అధిక ప్రాధాన్యత ఉన్న వినియోగదారులకు స్కోడా సూపర్బ్ నిజంగా సూపర్ ఆప్షన్. మైలేజ్ విషయానికి వస్తే స్కోడా సూపర్బ్ పెట్రోల్ డీజిల్ మరియు హైబ్రిడ్ మోడల్ కలిగి ఉంది. పెట్రోల్ మోడల్ అయితే 1.5 లీటర్ కు 40-45 mpg మరియు రెండు లీటర్లకు 50-55 mpg సామర్థ్యం కలిగి ఉంటుంది.
స్కోడా సూపర్బ్ మార్కెట్ ధర : 54 Lakhs
ముగింపు (Conclusion On Luxury Cars)
లగ్జరీ కార్లు అత్యాధునిక కలిగి ఉంటాయి అంతేకాకుండా మంచి డ్రైవింగ్ అనుభవాన్ని రుచి చూపిస్తాయి. అంతే కాకుండా మీ అందమైన ప్రయాణాన్ని మరింత అందంగా చేస్తాయి. మీరు మీ జీవితంలో కలలు కన్నా Luxury Car మీరు సొంతం చేసుకోవాలని Carsandmobiles.com కోరుకుంటుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ: Luxury Cars)
Luxury Cars గురించి మేము అందించిన సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మా వెబ్సైట్ వీక్షకులు అడిగిన ప్రశ్నల్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు వాటి సమాధానాలు క్రింద తెలియజేశాము. మీకు కూడా Luxury Cars కు సంబంధించి ఎటువంటి ప్రశ్న లైన ఉన్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
What are the best luxury cars in India?
Land Range Rover Velar, Skoda Superb, Mercedes-Benz A-Class Limousine.
What are the upcoming luxury cars in India?
Skoda Superb, BYD Seal, Mercedes Benz GLA..etc
How many luxury cars are there in India?
మా అంచనా ప్రకారం భారతదేశంలో మొత్తం 81 రకాల లగ్జరీ కార్లు ఉన్నాయి.