car Safety Ratings: కారు కొనే ముందు చూడవలసిన ముఖ్యమైన భద్రత సౌకర్యాలు మరియు ప్రాముఖ్యత

Car Safety Features, Introduction, Safety Features, Car Safety Ratings, Conclusion, FAQ (సీటు బెల్టు, ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, బ్యాకప్ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ టూల్స్, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి )

ముంబై నగరంలో విమల్ అనే ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. అయితే ఒకరోజు అతనికి ఒక ముఖ్యమైన క్లైంట్ మీటింగ్ ఉంది. క్లైంట్ మీటింగ్ కి సరైన టైం కి చేరుకోవాలని తన టాటా నెక్సన్ కారులో ప్రయాణం చేశాడు అయితే సమయానికి చేరుకోవాలన్న తొందరలో అత్యంత వేగంగా కారును నడిపి ఒక వీధి దగ్గర టర్నింగ్ తీసుకునేటప్పుడు సుమోను ఢీ కొన్నాడు. అయితే తను జరిగిన సంఘటన గురించి అందరితో పంచుకున్నాడు.

తను చెప్పినది ఏమిటంటే కారు ఢీ కొట్టేటప్పుడు తనకు ఏమీ తెలియలేదు కానీ తెల్లటి బెలూన్స్ తన మొహం మీదకి దూసుకు వచ్చాయి అయితే యాక్సిడెంట్ అయిన కొద్ది నిమిషాల తర్వాత తాను స్పృహలోకి వచ్చాను అని అప్పుడు తనకు అర్థమైంది ఏమిటంటే ఎయిర్ బ్యాగ్స్ తన ప్రాణాలను కాపాడాయి అని. అప్పటి నుంచి తన మిత్రులందరికీ కారు కొనబోయే ముందు Car Safety Features మరియు Car Safety Ratings చూసుకొని కొనండి అని వాళ్లకి సలహా ఇవ్వటం అలవాటు చేసుకున్నాను అని చెప్పాడు. కారు లో ఎయిర్ బ్యాగ్స్ సరైన విధానంగా అమర్చి నందుకు టాటా సంస్థకు విమల్ ధన్యవాదాలు చెప్పాడు . కారు అతి వేగంగా నడపటం ప్రమాదమని , సేఫ్టీ ఫ్యూచర్స్ ఎంత ముఖ్యమో తన కి అర్థమైంది అని చెప్పాడు.

మీరు కూడా కారు కొనబోయే ముందు చూడవలసిన భద్రత సౌకర్యాలు మరియు సేఫ్టీ రేటింగ్స్ పరిశీలన గురించి ఈ వ్యాసంలో పొందుపరిచాము. ఈ ఆర్టికల్లో మీ కారులో తప్పక ఉండవలసిన ముఖ్యమైన భద్రత సౌకర్యాలు వాటి యొక్క ప్రాముఖ్యత మరియు సేఫ్టీ రేటింగ్స్ ను ఎలా పరిశీలించాలి వంటి అంశాలను చర్చించాము.

Table of Contents

కారుకు ఉండవలసిన ముఖ్యమైన భద్రత సౌకర్యాలు(Safety Features) మరియు వాటి విశ్లేషణ.

కారు కొనే ముందు భద్రతకు సంబంధించిన అంశాలను మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అంతేకాకుండా ఆయా కంపెనీలు ఎటువంటి భద్రతాపరమైన ఫీచర్స్ ను అందిస్తున్నాయి అనే విషయాన్ని మనం విశ్లేషించుకోవాలి. కారులో తప్పనిసరిగా ఉండవలసిన అత్యాధునిక భద్రతాపరమైన ఫీచర్లను మేము ఇక్కడ తెలియజేస్తున్నాం.

సీటు బెల్టు (Seat Belt)

ఎప్పుడైనా కారులో వేగంగా ప్రయాణించేటప్పుడు అత్యవసర బ్రేకు వేసే అవసరం రావచ్చు అలాంటి సమయంలో సీటు బెల్టు మనల్ని గాయాల బారి నుంచి కాపాడుతుంది. అంతేకాదు ప్రమాదవశాత్తు ఏదైనా వాహనము అనుకోకుండా వేగంగా ఎదురైనప్పుడు సీటు బెల్టు మనల్ని ముందుకు పడకుండా నిలువరిస్తుంది. ఇప్పుడు వచ్చిన అత్యాధునిక కారు మోడల్ లలో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన బెల్టులు మరియు పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన సీట్ బెల్ట్ లు కూడా అమర్చబడుతున్నాయి. సీటు బెల్టు లకు సరైన ప్యాడింగ్ ఉండటం ఎంతో ముఖ్యం.

ఎయిర్‌బ్యాగ్‌లు (Air Bags)

ఎయిర్‌బ్యాగ్‌లు వాహన భద్రతా వ్యవస్థల్లో అంతర్భాగంగా ఉంటాయి, సీట్ బెల్ట్‌లు మరియు ఇతర భద్రతా లక్షణాలతో కలిసి పనిచేస్తాయి, ప్రమాదం సంభవించినప్పుడు ప్రయాణికులను రక్షించడంలో సహాయపడతాయి. డ్రైవర్లు మరియు ప్రయాణీకులు ఎల్లప్పుడూ సీట్ బెల్ట్‌లను సరిగ్గా ధరించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఎయిర్‌బ్యాగ్‌లు సీట్ బెల్ట్ వినియోగాన్ని పూర్తి చేయడానికి రూపొందించబడ్డాయి, దానిని భర్తీ చేయడానికి కాదు.

యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)

ABS హార్డ్ బ్రేకింగ్ సమయంలో చక్రాలు లాక్ అవ్వకుండా నిరోధించడంలో సహాయపడుతుంది, ఇది డ్రైవర్ కారును నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (Electronic Stability System)

ESC ముఖ్యంగా జారే రోడ్లపై లేదా ఆకస్మిక మలుపుల సమయంలో స్కిడ్డింగ్‌ను గుర్తించడం మరియు తగ్గించడం ద్వారా ప్రమాదాలను నియంత్రిస్తుంది.

ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (Traction Control System)

TCS కారు వేగంగా వెళ్లే సమయంలో ట్రాక్షన్‌ను నిర్వహించడంలో సహాయపడుతుంది, ముఖ్యంగా జారే రోడ్ల పై ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

బ్యాకప్ కెమెరా (Backup Camera)

బ్యాకప్ కెమెరా కారును పార్కింగ్ చేసేటప్పుడు మరియు రివర్స్ చేసుకునేటప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కారు రివర్స్ చేసుకునేటప్పుడు వెనక ఉన్న వాహనాలను లేదా అడ్డంకులను మనకు స్క్రీన్ లో స్పష్టంగా చూపిస్తుంది తద్వారా ప్రమాదాలను నివారిస్తుంది.

బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ (Blind Spot Monitoring System)

ఇది ప్రతి కారుకు ఉండవలసిన అతి ముఖ్యమైన ఫీచర్. ఈ ఫీచర్ బ్లైండ్ స్పాట్ లను అనగా ముందుగా అంచనా వేయలేని మలుపులను గుర్తిస్తుంది మరియు కారు మలుపు తీసుకునేటప్పుడు బ్లైండ్ స్పాట్లు గూర్చి హెచ్చరిస్తుంది.

లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్ (Lane Departure Warning System)

సిగ్నలింగ్ లేకుండా వాహనం దాని దారి నుండి బయటికి వెళ్లినట్లయితే ఈ సిస్టమ్ డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది, అనుకోని లేన్ మార్పులను నిరోధించడంలో సహాయపడుతుంది.

ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (Automatic Emergency Breaking)

ఈ ఫీచర్ డ్రైవర్ ప్రమాదం సంభవించినప్పుడు సరైన సమయంలో స్పందించకపోతే ఆటోమేటిగ్గా బ్రేక్ పడి కారును నిలువరిస్తుంది అంతేకాకుండా ఇది జరగబోయే ప్రమాదాలను వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది.

టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (Tyre Pressure Monitoring System)

TPMS టైర్ ప్రెజర్‌ను పర్యవేక్షిస్తుంది మరియు ఏదైనా టైర్ ప్రెజర్‌ గణనీయంగా తక్కువగా ఉంటే డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది, సురక్షితమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహిస్తుంది మరియు టైర్ బ్లోఅవుట్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (Adaptive Cruise Control)

ఈ ఫీచర్ నిర్ణీత వేగాన్ని నిర్వహిస్తుంది కానీ ముందున్న వాహనాల నుండి సురక్షితమైన దూరాన్ని ఉంచడానికి సర్దుబాటు చేస్తుంది, ట్రాఫిక్‌లో డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా చేస్తుంది.

ఎమర్జెన్సీ ఎగ్జిట్ టూల్స్ (Emergency Exit Tools)

వీటిలో సీట్‌బెల్ట్ కట్టర్ మరియు విండో బ్రేకర్ ఉన్నాయి, ప్రమాదం జరిగిన తర్వాత కారులో చిక్కుకోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది.

ప్రథమ చికిత్స వస్తు సామగ్రి (AID Kit)

వైద్య సహాయం వచ్చే వరకు ప్రతి కారులో బ్యాండేజీలు, క్రిమినాశక మందులు మరియు చిన్న గాయాలకు సంబంధించిన ఇతర వైద్య సామాగ్రితో కూడిన ప్రథమ చికిత్స వస్తు సామగ్రి ఉండాలి.

మీ కారులో ఈ ఫీచర్లు కలిగి ఉండటం వలన డ్రైవర్ మరియు ప్రయాణీకులు ఇద్దరికీ భద్రతను మెరుగుపరుస్తుంది, డ్రైవింగ్‌ను సురక్షితమైన మరియు మరింత సౌకర్యవంతమైన అనుభూతిని కలిగిస్తుంది.

Car Safety Ratings ప్రాముఖ్యత

కారు భద్రత రేటింగ్‌లు కారు ఎంత సురక్షితమో తెలియజేస్తుంది. ప్రమాదాలలో ఉన్న వ్యక్తులను కారు ఎంతవరకు కాపాడుతుందో తెలుసుకోవడానికి అవి మాకు సహాయపడతాయి. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) మరియు ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ హైవే సేఫ్టీ (IIHS) వంటి సంస్థలు ఈ రేటింగ్‌లను అందిస్తాయి. NHTSA కార్లను రేట్ స్టార్ల రూపంలో తెలియజేస్తుంది అనగా ఒక స్టార్ ఉంటే తక్కువ సేఫ్టీ అని మూడు స్టార్లు ఉంటే పర్వాలేదు అని నాలుగు స్టార్లు ఉంటే అత్యంత సురక్షితమైన కారు అని నిర్ధారిస్తుంది. ఎక్కువ నక్షత్రాలు అంటే కారు సురక్షితమైనదని అర్థం. వారు కారు ఫ్రంట్ క్రాష్‌లు, సైడ్ క్రాష్‌లు మరియు రోల్‌ఓవర్‌లను ఎలా హ్యాండిల్ చేస్తుంది వంటి అంశాలను పరీక్షిస్తారు. IIHS కూడా కార్లను పరీక్షిస్తుంది కానీ గుడ్, యాక్సెప్టబుల్, మార్జినల్ మరియు పూర్ వంటి పదాలను ఉపయోగిస్తుంది. వివిధ భద్రతా ప్రాంతాలలో కారు ఎంత బాగా పని చేస్తుందో ఇవి చూపుతాయి. కొత్త రేటింగ్‌లు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్‌లను పరిశీలిస్తాయి. ఈ కార్ రేటింగ్స్ మనం సురక్షితమైన కారును ఎన్నుకోవడంలో సహాయ పడతాయి.

ప్రతిష్టాత్మక కార్ల రేటింగ్ సంస్థల ప్రకారం అత్యధిక నాణ్యమైన భద్రత ఫీచర్లు కలిగిన Top 5 కార్ల వివరాలు (Top 5 Safety Rated Cars )

మహీంద్రా XUV700 (Mahindra XUV700)

ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు కలిగి, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థలతో సహా దాని బలమైన నిర్మాణ నాణ్యత మరియు సమగ్ర భద్రతా లక్షణాలకు పేరు పొందింది.

Also Read : ఇండియా లో 10 లక్షల లోపు ధర ఉన్న  అత్యుత్తమ కార్లు 2024

టాటా ఆల్ట్రోజ్ (TATA Altroz)

ఈ హ్యాచ్‌బ్యాక్ దాని 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌కు ప్రశంసలు పొందింది, ఇది భారతదేశంలోని దాని విభాగంలో సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS మరియు కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్‌తో వస్తుంది.

వోక్స్‌వ్యాగన్ పోలో (Volkswagen Polo)

పోలో దృఢమైన నిర్మాణ నాణ్యతను కలిగి ఉంది మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్‌లను కలిగి ఉంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta)

భారతదేశంలో ఒక ప్రసిద్ధ MPV, ఇన్నోవా క్రిస్టా అనేక ఎయిర్‌బ్యాగ్‌లు కలిగి, EBDతో కూడిన ABS, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు బలమైన ఛాసిస్ నిర్మాణం వంటి అనేక భద్రతా ఫీచర్లను అందిస్తుంది.

హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)

క్రెటా కారు బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ మరియు వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్‌తో సహా దాని భద్రతా లక్షణాలకు పేరుగాంచిన అత్యధికంగా అమ్ముడైన SUV మోడల్ కారు.

ముగింపు (Wrap Up On Car Safety Features and Car Safety Ratings)

ప్రాణం అన్నిటికన్నా విలువైనది అందుకని కారు కొనబోయే ముందు కంఫర్ట్ ఫీచర్స్ కన్నా భద్రతాపరమైన ఫీచర్స్ ను ఎక్కువగా పరిగణించాలని carsandmobiles.com మీకు సూచిస్తుంది. అంతేకాకుండా భద్రతాపరమైన రేటింగ్స్ ను జాగ్రత్తగా పరిశీలించి తదుపరి మీ కారును నిర్ణయించుకోండి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ: Car Safety Features and Car Safety Ratings)

ఈ వ్యాసంలో కార్ల భద్రత ఫీచర్లు మరియు సేఫ్టీ రేటింగ్ ల (Car Safety Ratings) గురించి మీకు వివరించాము. కార్లకు సంబంధించి లేదా కార్ల భద్రత టెక్నాలజీకి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు అయినా మీరు కామెంట్ రూపంలో తెలియపరచవచ్చు. మా మా వెబ్సైట్ విజిటర్స్ అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వాటి జవాబులు ఇక్కడ ఇవ్వబడినవి :

కార్ భద్రత రేటింగ్ అంటే ఏమిటి?

5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్ ప్రోగ్రామ్ క్రాష్ టెస్ట్‌లలో వాహనాల పనితీరు ఎలా ఉంటుందో అంచనా వేస్తుంది. NHTSA ఫ్రంటల్, సైడ్ మరియు రోల్‌ఓవర్ పరీక్షలను నిర్వహిస్తుంది ఎందుకంటే ఈ రకాలు అమెరికా రోడ్‌వేలలో ఎక్కువ క్రాష్‌లకు కారణమవుతాయి.

కార్స్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చే సంస్థల పేర్లు ఏంటి?

Insurance Institute for Highway Safety (IIHS),New Car Assessment Programs (NCAP), Global NCAP..etc

కార్ సేఫ్టీ కి ఏమేమి టెస్ట్ లు చేస్తారు?

adult occupant protection (AOP), child occupant protection (COP) and safety assist technologies (SAT).

Leave a Comment