When  is Tesla Car Coming to India ? టెస్లా కార్ ఇండియాలోకి ఎప్పుడు వస్తుంది?

When is Tesla Car Coming to India ? , Main Hurdles for Tesla Car Enter in to India, Upcoming Advanced Tesla Cars in India, Conclusion, FAQ (Upcoming Advanced Cars in India, Tesla Model 3, Tesla Model S, Tesla Model X, Tesla Model Y, Cybertruck)

Narendra Modi met Elon Musk

Image Source : PMO India

టెస్లా కార్ (Tesla Car) ఇండియాలోకి ఎప్పుడు వస్తుంది ? టెస్లా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ. టెస్లా కార్లు Environmental Friendly (EV) కార్ గా మంచి ఖ్యాతిని గడించాయి. టెస్లా కంపెనీ ఇళ్లకు అవసరమయ్యే సోలార్ ప్యానల్ మరియు బ్యాటరీలు కూడా తయారు చేస్తుంది. టెస్లా సీఈవో ప్రపంచంలోనే అత్యంత ధనికుల లో ఒకడైన ఎలాన్ మస్క్.

ఎలాన్ మస్క్ కేవలం సీఈఓ మాత్రమే కాదు స్పేస్ ఎక్స్ వంటి దిగ్గజ సంస్థను ప్రారంభించిన ప్రముఖుడు. ఎలాన్ మస్క్ దక్షిణాఫ్రికాలో జన్మించాడు తరువాత మెరుగైన వ్యాపార అవకాశాలు మరియు తన కలలను నిజం చేసుకోవడానికి మస్క్అమెరికాకు వెళ్ళాడు . మస్క్ న్యూరాలింక్ మరియు ది బోరింగ్ కంపెనీ వంటి ప్రాజెక్ట్‌లలో కూడా పని చేస్తున్నారు. అంగారక గ్రహానికి (Mars) వెళ్లడం క్లీన్ ఎనర్జీ ని తయారు చేయడం వంటి పెద్ద ప్రాజెక్టులను చేయాలనుకుంటున్నాడు. మస్క్ తాను చేయబోయే పనులు మరియు చేస్తున్న పనులను సోషల్ మీడియాలో ప్రజలతో పంచుకుంటున్నాడు ఆయన ట్విట్టర్ ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మస్క్ సృజనాత్మకంగా ఆలోచించే వ్యక్తులలో ప్రముఖంగా ఉంటాడు. మస్క్ అహర్నిశలు కొత్త విషయాలను కనుగొనడం కోసం పరితపిస్తూ ఉంటాడు దానికోసం శ్రమ పడుతూ ఉంటాడు.

Table of Contents

Major Hurdles for Tesla Car Enter in to India : Tesla Car భారతదేశంలో అడుగుపెట్టడానికి ఉన్న ప్రధాన ఆటంకాలు

అయితే భారతదేశంలో కార్ల ప్రియులు మరియు ప్రకృతి ప్రేమికులు టెస్లా కార్ ఎప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. జూన్ 2023 భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎలాన్ మస్క్ ను కలిశారు. భారతదేశంలో టెస్లా కార్ల ఉత్పత్తి విషయమై వీరి ఇరువురి మధ్య చర్చ జరిగింది టెస్లా కార్ అన్ని ఆటంకాలను అధిగమించి భారతదేశంలోకి అతి త్వరలో అడుగుపెడుతుందని ఇరువురు ఆశాభావం వ్యక్తం చేశారు.  దీనికి సంబంధించిన అడుగులు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం.టెస్లా కార్ భారతదేశంలో అడుగుపెట్టడానికి ఉన్న ప్రధాన ఆటంకాలు :

దిగుమతి పన్నులు (Import Duty)

టెస్లా కార్లు భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి అన్నిటికన్నా ప్రధాన సమస్యగా దిగుమతి పన్నులు కనబడుతున్నాయి. ఇతర దేశాల నుంచి ఉత్పత్తి అయ్యే కార్లకు మనదేశంలో అధిక దిగుమతి పన్ను వసూలు చేస్తున్నారు దీని కారణంగా టెస్లా కారు వినియోగదారుడికి చేరుకునేసరికి అత్యంత ధర పలికే అవకాశం ఉంది.

చార్జింగ్ స్టేషన్లు (Charging Stations)

టెస్లా ఎలక్ట్రిక్ కారు అవటం వలన చార్జింగ్ స్టేషన్లు అవసరం పడతాయి. కానీ, భారతదేశంలో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాలను సమకూర్చటం చాలా కష్టతరమైన విషయం. ఈ ఛార్జింగ్ స్టేషన్ల విషయం టెస్లా సంస్థకు ఛాలెంజ్ గా మారింది.

స్థానిక ఉత్పత్తి (Local Production)

మేక్ ఇన్ ఇండియా లో భాగంగా భారత ప్రభుత్వం టెస్లా కార్లను భారతదేశంలోనే తయారుచేసి ఉత్పత్తి చేయమని టెస్లా సంస్థను కోరింది. దీనికి సంబంధించి టెస్లా సానుకూలంగానే ఆలోచిస్తుంది కానీ ఇది వాస్తవ రూపంలోకి రావడానికి సమయం పడుతుంది.

నియమాలు మరియు నిబంధనలు (Rules and Regulations)

మనదేశంలో ఎలక్ట్రానిక్ కార్ల తయారీ మరియు దిగుమతి కి సంబంధించిన నియమాలు స్పష్టంగా లేవు. ఇందువలన టెస్లా సంస్థకు మనదేశంలో టెస్లా కాళ్ళను ఉత్పత్తి చేయడం సాంకేతికంగా కష్టమవుతుంది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

మార్కెట్ పరిణామం (Market Evolution)

భారతదేశంలో ప్రజలు పెట్రోల్ మరియు డీజిల్ కార్ల వాడకానికి అలవాటుపడ్డారు కానీ ఈమధ్య ఈ బైకులు మరియు ఎలక్ట్రానిక్ ఆటోలు వ్యాన్లు కొనుగోళ్లు అధిక మొత్తంలో జరుగుతున్నాయి ఈ విషయం టెస్ట్ లాకు చాలా ఆశాజనకంగా ఉన్న ఎలక్ట్రానిక్ కార్లు భారతదేశంలో ఎంతవరకు విజయవంతం అవుతాయి అన్న సందేహం టెస్లా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి ఉంది.

టెస్లా కార్ల ప్రత్యేకతలు : Features of Tesla Car

ఆటోమేటిక్ డ్రైవింగ్

టెస్లా కారు డ్రైవర్ స్టీరింగ్ పట్టుకోకుండా నే ఆటోమేటిక్ గా మ్యాప్ సహాయంతో ప్రయాణం చేయగలవు కొన్ని సందర్భాలలో కారు పార్కింగ్ కూడా చాలా తేలికగా చేయవచ్చు కానీ ఈ ఆటోమేటిక్ డ్రైవింగ్ విధానం అన్ని ప్రదేశాల్లో కుదరదు కనుక అవకాశం బట్టి ఈ ఫీచర్ ని వాడుకోవచ్చు.

సింగిల్ చార్జింగ్

టెస్లా కారు ఒక్కసారి చాట్ చేస్తే చాలు కారు మోడల్ బట్టి 400 నుంచి 700 మైళ్ళ వరకు ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా టెస్లా సంస్థ చార్జింగ్ స్టేషన్లను దారి పొడవునా ఏర్పాటు చేస్తుంది.

కూల్ టెక్నాలజీ

టెస్లా కారు అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించబడినది అంతేకాదు ఇది ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకోగలదు.

ప్రత్యేక చార్జింగ్ స్టేషన్లు

టెస్లా సంస్థ దారి పొడవునా ప్రత్యేక చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది కనుక ఇంటి వద్దనే చార్జింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంటిదగ్గర చార్జింగ్ చేసుకున్న తర్వాత చార్జింగ్ అయిపోతుంది అన్న భయం అవసరం లేదు.

భారతదేశంలో రాబోవు టెస్లా ఆధునిక ఇవి కార్లు : Upcoming Advanced Tesla Cars in India

Tesla Cars in India

నిపుణుల అంచనా ప్రకారం 2025 లేదా 2026 లోపు టెస్లా కార్లు భారతదేశానికి రాబోతున్నాయి. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ టెస్లా నిర్విరామంగా చేస్తుంది. అయితే మా పరిశోధన ప్రకారం టెస్లా కొన్ని మోడల్ లను భారతదేశానికి తీసుకురావడానికి కృషి చేస్తుంది ఆ మోడల్ వివరాలు మరియు వాటి ధరలు ఈ విధంగా ఉన్నాయి:

టెస్లా మోడల్ 3 (Tesla Model 3)

ఇది టెస్లా యొక్క అత్యంత సరసమైన మోడల్ మరియు భారతదేశంలో ప్రారంభ ధర ₹60 లక్షల నుండి ₹70 లక్షల వరకు ఉంటుందని అంచనా వేయబడింది.ఇది ఆకట్టుకునే పనితీరు మరియు ఫీచర్లతో కూడిన సొగసైన మరియు స్టైలిష్ సెడాన్, ఇది ఎలక్ట్రిక్ కార్ ప్రియులలో ఒక ప్రసిద్ధ ఎంపిక..

Also Read: ఇండియా లో డిమాండ్ ఉన్న అతి ముఖ్యమైన ఎలక్ట్రిక్ కార్లు 2024

టెస్లా మోడల్ S (Tesla Model S)

అధునాతన ఫీచర్లతో కూడిన లగ్జరీ సెడాన్, దీని ధర భారతదేశంలో దాదాపు ₹1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చని అంచనా వేయబడింది.

టెస్లా మోడల్ X (Tesla Model X)

ప్రత్యేకమైన ఫాల్కన్-వింగ్ డోర్‌లతో కూడిన ప్రీమియం ఎలక్ట్రిక్ SUV, దీని ప్రారంభ ధర సుమారు ₹1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ఉంటుందని అంచనా వేయబడింది.

టెస్లా మోడల్ Y (Tesla Model Y)

ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV, ఇది మోడల్ 3 ధరతో సమానంగా రూ.60 లక్షల నుండి ₹70 లక్షల వరకు ఉంటుందని ఊహించబడింది.

టెస్లా సైబర్‌ట్రక్ (Cybertruck)

ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్, భారతదేశంలో దీని ధర అనిశ్చితంగా ఉంది, అయితే దిగుమతి సుంకాలు మరియు పన్నుల కారణంగా అధిక ముగింపులో ఉండే అవకాశం ఉంది.

ముగింపు : (Conclusion on Tesla Car in India )

మేము టెస్లా కి సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఈ ఆర్టికల్లో తెలియజేశాము. మీకు టెస్లా కార్లకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కామెంటు రూపంలో తెలియజేయండి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ: Tesla Cars in India)

ప్ర : టెస్లా కార్ యొక్క మైలేజీ ఎంత?

టెస్లా యొక్క మోడల్ S, మోడల్ X మరియు మోడల్ Y ఎంచుకున్న బ్యాటరీ ఎంపికపై ఆధారపడి సుమారు 400 మైళ్లు మరియు అంతకంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంటాయి. లాంగ్ రేంజ్ మోడల్ S మరియు Xలు దాదాపు 373 మైళ్ల పరిధిని కలిగి ఉంటాయి మరియు మోడల్ Y లాంగ్ రేంజ్ 326 మైళ్ల పరిధిని కలిగి ఉన్నాయి.

ప్ర : టెస్లా కారు భారతదేశంలోకి ఎప్పుడు వస్తుంది?

టెస్లా కంపెనీ ఇండియాలో టెస్లా మోటార్స్ ఇండియా గా 2021లో రిజిస్టర్ చేసుకుంది. జూన్ 2023 ప్రధాని మోదీ మరియు టెస్లా ceo ఎలాన్ మస్క్ అమెరికాలో భేటీ అయ్యారు. ప్రస్తుతం టెస్లా తన కార్యకలాపాలను భారతదేశంలో త్వరగా ప్రారంభించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.

ప్ర : టెస్లా కార్ల ధర ఇండియాలో ఎంత ఉండవచ్చు?

భారతదేశంలో టెస్లా కార్లు సైబర్‌ట్రక్ (రూ. 50.70 లక్షలు), మోడల్ 2 (రూ. 45.00 లక్షలు) మరియు మోడల్ ఎక్స్ (రూ. 2.00 కోట్లు) 2024-2025 సంవత్సరంలో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. మీ నగరంలో తాజా ఆఫర్‌లు, ధరలు, వేరియంట్లు, స్పెసిఫికేషన్‌లు, చిత్రాలు, మైలేజ్ మరియు సమీక్షలను తెలుసుకోవడానికి టెస్లా కారును ఎంచుకోండి. టెస్లా గ్లోబల్ ఆటోమోటివ్ దృశ్యాన్ని చాలా అక్షరాలా విద్యుదీకరించింది.

Leave a Comment