Top Best Selling Cars, Conclusion, FAQ (అత్యధికంగా అమ్ముడు పోయే కార్లు ,టాటా పంచ్, మారుతి సుజుకి వ్యాగన్, మారుతి సుజుకి బ్రెజ్జా, మారుతి సుజుకి డిజైర్ , హ్యుందాయ్ క్రెటా , మహీంద్రా స్కార్పియో N + క్లాసిక్, ముగింపు, తరచుగా అడిగే ప్రశ్నలు)
భారతదేశంలో కారు మీద ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యేకంగా మన దేశంలో ఒక మనిషి స్థిరపడ్డాడు అంటే తను ఇల్లు కట్టుకోవడం మరియు కారు కొనడం బట్టి నిర్ణయానికి వస్తాం. కారు మన భారతీయుల జీవితంలో అంత ముఖ్య పాత్ర పోషిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రికార్డు స్థాయిలో కార్ల విక్రయాలను చవిచూసింది అది ఎంతగా అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 8.7% కార్ల విక్రయాల్లో పెరుగుదల నమోదయింది. ఆర్థిక సంవత్సరంలో 4.23 మిలియన్ యూనిట్ల కార్లు విక్రయించబడ్డాయి.
Top Best Selling Cars in India ( అత్యధికంగా అమ్ముడు పోయే కార్లు )
భారతదేశంలో అనేక ప్రముఖ కంపెనీలు కార్ల విక్రయాలలో పోటీ పడతాయి. వాటిల్లో ప్రధానంగా మారుతి సుజుకి, హుండాయ్, టాటా, మహీంద్రా, ఇంకా చాలా మరియు విదేశీ కంపెనీలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మారుతి సుజుకి ఎగుమతులతో సహా మొత్తం రెండు మిలియన్ యూనిట్లకు పైగా విక్రయాలు సాధించి రికార్డు సృష్టించింది తర్వాత హుండాయ్ మోటార్ ఇండియా 777,876 యూనిట్లు విక్రయించబడి 8% పెరుగుదలను నమోదు చేసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కొన్ని ముఖ్యమైన కార్లు మరియు వాటి వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలియజేస్తున్నాం. ఈ విక్రయ లెక్కలు ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది వాటిల్లో కొన్ని ముఖ్యాంశాలు నీకు తెలియజేస్తున్నాము.
టాటా పంచ్ (TATA Punch)
Image Source : Carwala
టాటా పంచ్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్. టాటా పంచ్ ఒక్క ఏప్రిల్ నెలలోనే 19,158 యూనిట్లను విక్రయించింది . టాటా పంచ్ టాటా పంచ్ 86.63 bhp మరియు 115 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.2L Revotron పెట్రోల్ ఇంజన్‌తో కూడిన ఒక కాంపాక్ట్ SUV. ఇది 7″ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు భద్రత కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లతో బలమైన డిజైన్‌ను కలిగి ఉంది. tata పంచ్ మార్కెట్ ధర రూ.6- రూ.10.10 లక్షలు మరియు మైలేజీ 18.8 kmpl నుండి 26.99 km/kg.
మారుతి సుజుకి వ్యాగన్ (Maruth Suzukhi Wagon R)
Image Source : Carwala
మారుతి సుజుకి వ్యాగన్ అత్యధిక ఆదరణ పొందుతున్న కార్లలో ఒకటి. విశాలమైన ఇంటీరియర్ మరియు ప్రాక్టికాలిటీ కి ప్రసిద్ధి చెందింది. మారుతి సుజుకి వ్యాగన్ ఒక్క ఏప్రిల్ నెలలోనే 17,850 యూనిట్లను విక్రయించింది..ఈ కారులో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS మరియు 341 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్ ఉన్నాయి. ఈ కారు కుటుంబంతో ప్రయాణం చేయడానికి అత్యంత అనువైనది. అంతేకాకుండా మధ్య తరగతి కుటుంబాలకు బాగా అందుబాటు లో ఉన్న ధరతో లభిస్తుంది. దీని మార్కెట్ ధర రూ.5.54- రూ.7.42 లక్షలు మరియు మైలేజీ 24.35 kmpl నుండి 34.05 km/kg.
మారుతి సుజుకి బ్రెజ్జా (Maruthi Suzukhi Brezza)
Image Source : Carwala
ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక సేల్స్ సాధించిన కారు మోడల్స్ లో ఒకటి. ఇది మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది అంతేకాకుండా LED హెడ్‌ల్యాంప్‌లతో కూడిన ఆధునిక డిజైన్, విశాలమైన క్యాబిన్ మరియు స్మార్ట్‌ప్లే స్టూడియో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది మరియు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి భద్రతా లక్షణాలతో తయారు చేయబడింది. మారుతి సుజుకి బ్రెజ్జా ఒక్క ఏప్రిల్ నెలలోనే 17,113 యూనిట్లను విక్రయించింది..దీని మార్కెట్ ధర 8.29-14.14 లక్షలు మరియు 17.38 kmpl to 25.51 km/kg మైలేజీ కలిగి ఉంటుంది.
Also Read : భళారే అనిపించే అద్భుతమైన విలాసవంతమైన కార్లు 2024
మారుతి సుజుకి డిజైర్ (Maruthi Suzuki Dzire)
Image Source : Carwala
మారుతి సుజుకి డిజైర్ మంచి ఇంటీరియర్ మరియు ఇంధన సామర్థ్యం తో తయారు చేయబడిన కారు. ఎకనామిక్ క్లాసులో అత్యంత ప్రసిద్ధి చెందిన కార్లలో ఒకటి. ఫీచర్స్ విషయానికి వస్తే విశాలమైన ఇంటీరియర్స్ మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లేతో కూడిన స్మార్ట్‌ప్లే స్టూడియో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. మారుతి సుజుకి డిజైర్ ఒక్క ఏప్రిల్ నెలలోనే 15,825 యూనిట్లను విక్రయించింది.దీని మార్కెట్ ధర 6.59 – 9.39 లక్షలు గా ఉంది. మైలేజ్ విషయానికి వస్తే 22.41 – 22.61 km/l వరకు ఇస్తుంది.
హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)
Image Source : Carwala
2024 సంవత్సరంలో బాగా ప్రసిద్ధి చెందిన కాంపాక్ట్ SUV కారు. ఫీచర్స్ చాలా అత్యాధునికంగా డిజైన్ చేయబడినది వాటిల్లో లేన్ కీపింగ్ అసిస్ట్ మరియు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి సమగ్ర డ్రైవర్ సహాయ సాంకేతికతలను అందించే లెవల్ 2 ADAS సూట్‌తో సహా అధునాతన భద్రతా ఫీచర్లను క్రెటా కలిగి ఉంది. అత్యాధునిక పనితీరును అందించడానికి ప్రత్యేకమైన ట్రాన్సిషన్ తో డిజైన్ చేయబడింది. సేల్స్ విషయానికి వస్తే ఒక్క ఏప్రిల్ నెలలోనే 15,447 యూనిట్లను విక్రయించింది..హ్యుందాయ్ క్రెటా మార్కెట్ ధర 10.87- 19.20 లక్షల వరకు ఉంటుంది. క్రెటా 17 kmpl to 23 kmpl వరకు మైలేజ్ ను అందిస్తుంది.
మహీంద్రా స్కార్పియో N + క్లాసిక్ (Mahindra Scorpio N+ Classic)
Image Source : Carwala
మహేంద్ర స్కార్పియో ఎవర్గ్రీన్ మోడల్ గా చెప్పవచ్చు. అందులో మహీంద్రా స్కార్పియో N + క్లాసిక్ మోడల్ కార్ 2024లో అత్యధికంగా ఆదరణ పొందుతున్న కారుగా గుర్తింపు పొందింది. ఫీచర్ల విషయానికొస్తే N 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వెనుక AC వెంట్లు మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన సాంకేతికతలతో కూడిన ఆధునిక డిజైన్‌ను కలిగి ఉంది. ఇది 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌తో 175 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో నిర్మించబడింది. ఈ కారు యొక్క మార్కెట్ ధర 15.62- 20.03 లక్షల గా ఉంది మరియు మైలేజ్ విషయానికి వస్తే 16.36 kmpl-15.4 kmpl వరకు ప్రయాణించగలదు. ఈ మోడల్ ఒక్క ఏప్రిల్ నెలలోనే 14,807 యూనిట్లను విక్రయించింది.
ముగింపు (Conclusion On Best Selling Cars)
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న కార్ల వివరాలు తెలుసుకున్నారు కదా. ఆ తదుపరి ఆర్టికల్‌లో మరిన్ని కార్ల సమాచారం మీకు అందిస్తాము. మా ఆర్టికల్ మీ కారు కొనుగోలు చేసే రీసెర్చ్ లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ: Best Selling Cars)
అత్యధికంగా అమ్ముడుపోతున్న కార్లు (Best Selling Cars ) అంశం మీద మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్న మమ్మల్ని కామెంట్స్ రూపంలో అడగవచ్చు. మా వెబ్సైట్ వీక్షకులు అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఈ క్రింద ఇవ్వటం జరిగినది.
Which is the most sold car in India?
టాటా పంచ్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్. టాటా పంచ్ ఒక్క ఏప్రిల్ నెలలోనే 19,158 యూనిట్లను విక్రయించింది
Which car has highest resale value in India?
మా పరిశీలనలో హోండా సిటీ అత్యధికంగా రీ సేల్ అయ్యే కారుగా చెప్పవచ్చు దీనికి కారణం ఈ కారు యొక్క ఇంజన్ సామర్థ్యం మరియు ఇంటీరియర్ స్పేస్.
Which is the best low maintenance car?
మారుతి బ్రాండ్ కార్లు సులువుగా మెయింటైన్ చేసుకోవచ్చు.