Introduction, Best Family Cars, Conclusion, FAQ ( టాటా నెక్సన్, మారుతి సుజుకి బాలెనో , టాటా టిగోర్ , మహీంద్రా XUV700, హ్యుందాయ్ వెర్నా)
ప్రతి మధ్యతరగతి మనిషి కల తన కుటుంబం మొత్తాన్ని కారులో షికారు తీసుకువెళ్లాలి అని. మరి మార్కెట్లో లభ్యమయ్యే అత్యుత్తమ కార్లు అంటే కుటుంబ సమేతంగా హాయిగా విహరించే మరియు అందుబాటు ధరలో ఉండే కార్ల వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో కుటుంబంతో ప్రయాణం చేయడం కోసం అత్యధికంగా ఆకట్టుకుంటున్న కార్ల వివరాలు మరియు వాటి మార్కెట్ ధరలు మీకు తెలియజేస్తాము.
ఈ కార్ల లో ఫ్యామిలీతో హాయిగా ప్రయాణించండి(Top 5 Family Cars )
కుటుంబ సమేతంగా హాయిగా ప్రయాణించే అనువైన మరియు అందుబాటు ధరలో ఉండే కొన్ని కార్ల గురించి తెలియజేస్తాము. టాటా, సుజుకి, హుండాయ్ మరియు అనేక సంస్థలు మధ్యతరగతి వినియోగదారునికి అందుబాటులో ఉండే సౌకర్యవంతమైన కార్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మేము తెలియజేసే ఈ కార్లు మా పరిశీలనలో అత్యధికంగా ఆదరణ పొందుతున్న కార్లు.
టాటా నెక్సన్ (TATA Nexon)
Image Source : Acko
టాటా నెక్సన్ అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు మరియు విశాలమైన ఇంటీరియర్ ఇవన్నీ కాకుండా మంచి అందుబాటు ధరలో లభ్యమవటం వలన మంచి ఆదరణ పొందుతోంది. 5 స్టార్ట్ NCAP రేటింగ్ కలిగి మంచి భద్రతా ప్రమాణాలతో ఈ కారును డిజైన్ చేశారు. డ్రైవర్ సీట్ కాకుండా ప్రయాణికులకు సైతం అత్యంత సౌకర్యంగా విశాలమైన క్యాబిన్ తో నిర్మించారు. ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్లు వంటి అధునాతన భద్రతా ఫీచర్లు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయి. మంచి స్ట్రాంగ్ బాడీ కలిగి మల్టీ డ్రైవింగ్ మోడ్ లతో ఈ కారు తీర్చిదిద్దారు. విహార యాత్రకు వెళ్ళడానికి ఈ కారు చాలా అనువుగా ఉంటుంది.
టాటా నెక్సన్ ఇంజన్ మోడల్ ని బట్టి లీటరుకు 18 నుంచి 22 కిలోమీటర్లు వరకు మైలేజ్ వస్తుంది.
మార్కెట్ ధర : 8 నుంచి 14 లక్షలు
మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno )
Image Source : Acko
మారుతి సుజుకి బాలెనో కుటుంబంతో సౌకర్యంగా ప్రయాణించగల కారు. ప్రయాణికులకు మంచి స్పేస్ లగేజీ పెట్టుకోవడానికి అనువైన క్యాబిన్ కలిగి మంచి ఆదరణ పొందుతున్న కారు. బాలెనో యొక్క స్మూత్ రైడ్ మరియు సమర్థవంతమైన ఇంధన వినియోగం కలిగి ఉంటుంది. యాపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన అధునాతన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రయాణికులకు ఆహ్లాదకరమైన అనుభూతినిస్తాయి.
మారుతి సుజుకి బాలెనో ఇంజన్ మోడల్ ని బట్టి లీటరుకు 22 నుంచి 30 కిలోమీటర్లు వరకు మైలేజ్ వస్తుంది.
మార్కెట్ ధర : 8 నుంచి 14 లక్షలు
Also Read : రేస్ కార్ల గురించి తెలుసుకుందాం రండి
టాటా టిగోర్ (TATA Tigor)
Image Source : Acko
టాటా టిగోర్ విశాలమైన మరియు సౌకర్యవంతమైన ఇంటీరియర్ కలిగి కుటుంబ సమేతంగా ప్రయాణించి దగ్గర కారుగా ప్రసిద్ధి చెందింది. ప్రయాణించేటప్పుడు అత్యధిక లగేజీని తీసుకు వెళ్ళటానికి తగ్గ సౌకర్యం ఈ కారు యొక్క ప్రత్యేకత. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ప్రత్యేక భద్రత ఫీచర్లు సౌకర్యవంతమైన మరియు భద్రత కలిగిన ప్రయాణ అనుభూతిని మిగులుస్తాయి. కనెక్టివిటీ ఎంపికలతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కలిగి ప్రయాణానికి వినోదాన్ని జత చేస్తాయి.
టాటా టిగోర్ ఇంజన్ మోడల్ ని బట్టి లీటరుకు 19 నుంచి 26 కిలోమీటర్లు వరకు మైలేజ్ వస్తుంది.
మార్కెట్ ధర : 6.30 నుంచి 9 లక్షలు
మహీంద్రా XUV700 (Mahindra XUV700)
Image Source : Car Wale
మహీంద్రా XUV700 మోడల్ బట్టి ఐదుగురు నుంచి ఏడుగురు ప్రయాణించగల ఒక మంచి స్పేస్ కలిగిన ఫ్యామిలీ ఫ్రెండ్లీ కార్. బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ESP మరియు స్వయంప్రతిపత్తమైన ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు లేన్-కీపింగ్ అసిస్ట్ వంటి అధునాతన ఫీచర్లు కలిగి కుటుంబ సమేతంగా భద్రత మరియు ఆనందంతో కూడిన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. అంతే కాదు పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు వాయిస్ అసిస్టెంట్‌తో కూడిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లు వివిధ వాతావరణ పరిస్థితుల్లో సురక్షితంగా మరియు ఆహ్లాదంగా ప్రయాణించడానికి ఉపయోగపడతాయి.
టాటా టిగోర్ ఇంజన్ మోడల్ ని బట్టి లీటరుకు 12 నుంచి 17 కిలోమీటర్లు వరకు మైలేజ్ వస్తుంది.
మార్కెట్ ధర : 13 నుంచి 25 లక్షలు
హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna)
Image Source : Car Wale
హ్యుందాయ్ వెర్నా మధ్యతరగతి కస్టమర్లలో ఇటీవల అత్యధిక ఆదరణ పొందుతున్న కాళ్లలో ఒకటి. 2023 న్యూ మోడల్ కస్టమర్లను బాగా ఆకర్షిస్తుంది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ కార్ గా పేరు పొందటమే కాకుండా బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు వంటి భద్రతా ఫీచర్లు ఈ కారు యొక్క ప్రత్యేకత. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు వెనుక AC వెంట్లు ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచుతాయి. ఇది విహారయాత్రలకు కాకుండా రోజువారి ప్రయాణాలకు కూడా బాగా ఉపయోగపడుతుంది.
హ్యుందాయ్ వెర్నా ఇంజన్ మోడల్ ని 17 నుంచి 25 కిలోమీటర్లు వరకు మైలేజ్ వస్తుంది.
మార్కెట్ ధర : 10.90 నుంచి 17.80 లక్షలు
ముగింపు (Conclusion On Family Cars)
ఫ్యామిలీ కార్లు సౌకర్యం మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడతాయి, విశాలమైన ఇంటీరియర్స్ మరియు ప్రయాణీకులకు విస్తారమైన సీటింగ్లను కలిగి ఉంటాయి. ముఖ్యమైన భద్రత ఫీచర్ల అయిన బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS బ్రేక్‌లు మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి ఫీచర్స్ ను కలిగి ఉంటాయి. ఇంధన సామర్థ్యం మరియు విశ్వసనీయతకు కూడా ప్రాధాన్యత ఇస్తాయి, వాటిని రోజువారీ ప్రయాణాలకు మరియు సుదూర ప్రయాణాలకు అనువుగా చేస్తాయి, విమానంలోని ప్రతి ఒక్కరికీ సాఫీగా మరియు ఆనందించే రైడ్‌ను అందిస్తాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ: Family Cars)
ఫ్యామిలీ కార్ల గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ల రూపంలో తెలియజేయండి. మా వెబ్సైట్ విజిటర్స్ అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు క్రింద ఇచ్చాము.
Which car is best for a family 7 seater?
మహీంద్రా స్కార్పియో, మహీంద్రా XUV700, టయోటా ఇన్నోవా క్రిస్టా, కియా కేరెన్స్, మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా హైక్రాస్.
Which is the cheapest familyWhich car is best for family in low budget?
మారుతి ఆల్టో K10, మారుతి ఎస్-ప్రెసో, రెనో క్విడ్, మారుతి సెలేరియో, టాటా టియాగో, హైండై గ్రాండ్ i10 నియోస్ మొదలగునవి.